Sensex Hits New All Time High: సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:17 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్నుతో...
ఇంట్రాడేలో 86,000 పైకి సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్నుతో సెన్సెక్స్ ఒక దశలో 446.35 పాయింట్లు ఎగబాకి 86,055.86 వద్ద, నిఫ్టీ 105.15 పాయింట్ల వృద్ధితో 26,310.45 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డులను నమోదు చేశాయి. అయితే, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మధ్యాహ్నం సెషన్‌లో సూచీలు మళ్లీ కిందికి జారాయి. ఒక దశలో నష్టాల్లోకి మళ్లినప్పటికీ, మళ్లీ కాస్త తేరుకున్న సెన్సెక్స్.. చివరికి 110.87 పాయింట్ల లాభంతో 85,720.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.25 పాయింట్ల పెరుగుదలతో 26,215.55 వద్ద ముగిసింది. 2024 సెప్టెంబరు 27న సెన్సెక్స్ 85,978.25 వద్ద, నిఫ్టీ 26,277.35 వద్ద గత ఇంట్రాడే రికార్డులను నమోదు చేశాయి. అంటే, సూచీలు 14 నెలల తర్వాత మళ్లీ రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్ 7,581.37 పాయింట్లు (9.70 శాతం), నిఫ్టీ 2,570.75 పాయింట్లు (10.87 శాతం) పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News