Share News

Rainbow Childrens Hospital: రూ.900 కోట్లతో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ విస్తరణ

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:23 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2029 మార్చి నాటికి రూ.900 కోట్ల పెట్టుబడితో...

Rainbow Childrens Hospital: రూ.900 కోట్లతో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ విస్తరణ

ముంబై: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2029 మార్చి నాటికి రూ.900 కోట్ల పెట్టుబడితో కొత్తగా 900 పడకలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రధానంగా ఉత్తరాది మార్కెట్లో కార్యకలాపాల విస్తరణకు ఈ పెట్టుబడులు పెట్టనుంది. కొత్త పడకలతో హాస్పిటల్‌ మొత్తం పడకల సామర్థ్యం 3,165కి చేరుతుందని రెయిన్‌బో వెల్లడించింది. విస్తరణకు అవసరమైన నిధులను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకోనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏదైనా పెద్ద హాస్పిటల్‌ను టేకోవర్‌ చేయాల్సి వస్తే మా త్రం రుణ సేకరణకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 05:23 AM