ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అందాయి. మంగళవారం మధ్యాహ్నం హాజరు కావాలని అందులో పేర్కొంది.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేసులో ఇవాళ విచారణ జరిగింది. పవన్ విన్నపానికి ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే తమ తప్పు తెలుసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు చేశారు.
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ఆసక్తికరణ విశ్లేషణ చేసింది. 2029లో భారత ప్రధానిగా నారా చంద్రబాబు నాయుడు, లేదా నారా లోకేష్‌కు ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ అనాలసిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 లాంచ్‌కు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
టీడీపీ కేడర్‌పై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.