Share News

అమెరికాలో బెంగళూరు విద్యార్థి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:29 AM

అమెరికాలో వారం క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు విద్యార్థి సాకేత్‌ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభించింది. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో సాకేత్‌ కెమికల్‌ అండ్‌ బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌....

అమెరికాలో బెంగళూరు విద్యార్థి మృతదేహం లభ్యం

బెంగళూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): అమెరికాలో వారం క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు విద్యార్థి సాకేత్‌ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభించింది. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో సాకేత్‌ కెమికల్‌ అండ్‌ బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌ పీజీ చదువుతున్నారు. ఈ నెల 9న క్యాంపస్‌ నుంచి కిలోమీటరు దూరంలో చివరిసారిగా కనిపించిన తర్వాత అతని ఆచూకీ లేకుండా పోయింది. పార్క్‌ హిల్స్‌ ప్రాంతంలోని అతని నివాసం సమీపంలో సాకేత్‌ పాస్‌పోర్ట్‌, ల్యాప్‌టాప్‌ ఉన్న బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. చెరువు ఒడ్డున అతని దుస్తులు, చెప్పులు, వ్యక్తిగత వస్తువులు లభించినట్టు తెలుస్తోంది. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. సాకేత్‌ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాకేత్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని శనివారం ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో పేర్కొంది. ఐఐటీ మద్రా్‌సలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సాకేత్‌.. హైపర్‌లూప్‌ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్‌లో భాగస్వామి అయ్యారు. కాగా, సాకేత్‌ మరణం ప్రమాదమా.. లేక మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడ్డాడా అనేది తేలాల్సి ఉంది.

Updated Date - Feb 16 , 2026 | 03:29 AM