Share News

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్‌: శిరీష

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:27 AM

ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్‌: శిరీష

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించే మహేంద్ర తనయ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. నీతీ ఆయోగ్‌ సహకారంతో విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌కు ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారని, దీని ద్వారా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 03:27 AM