Share News

పట్టు రైతుకు లాభాల గూళ్లు

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:32 AM

రాష్ట్రంలో పట్టు గూళ్ల (కొకూన్‌) ధరలు భారీగా పెరిగాయి. సగటు ధర కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని అన్ని పట్టు గూళ్ల మార్కెట్లలో 2వారాల నుంచి కిలో కొకూన్‌ గరిష్ఠ ధర రూ.959 ఉండగా...

పట్టు రైతుకు లాభాల గూళ్లు

  • కొకూన్‌ ధరల పెరుగుదల ఫలితం

  • ప్రస్తుతం గరిష్ఠంగా రూ.959

  • త్వరలో 1000 దాటే అవకాశం

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టు గూళ్ల (కొకూన్‌) ధరలు భారీగా పెరిగాయి. సగటు ధర కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని అన్ని పట్టు గూళ్ల మార్కెట్లలో 2వారాల నుంచి కిలో కొకూన్‌ గరిష్ఠ ధర రూ.959 ఉండగా, సగటు ధర రూ.812 నుంచి రూ.848కి చేరింది. కర్ణాటకలోని రాంనగర్‌ మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.1,000 ఉండగా, సగటు ధర రూ.798 నుంచి రూ.824కు చేరింది. గత పక్షం రోజుల్లో కర్ణాటకలో కన్నా ఏపీలో సగటు ధర ఎక్కువగా ఉంది. కర్ణాటకలో గరిష్ఠ ధరతో పరిమితంగానే క్రయవిక్రయాలు జరిగినట్లు సమాచారం. కానీ ఏపీలో ధర పెరుగుదల కారణంగా ఎక్కువ మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరిందని చెప్తున్నారు. సగటు ధరను అంచనా వేసినప్పుడు రాష్ట్రంలోని పట్టు రైతులు పోటీతత్వ, లాభదాయక ధరలు పొందుతున్నారని పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. గతేడాది రూ.700 పలికిన కొకూన్‌.. ప్రస్తుతం రూ.959కు చేరింది. మరికొద్ది రోజుల్లో రూ.1,000దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సంప్రదాయంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ రెండో అతి పెద్దది. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగవుతోంది. 2025-26లో పట్టు పఽథకాల కింద 90ు రాయితీతో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.4.90 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇటీవల పట్టు రైతులకు బకాయిలు కూడా చెల్లించింది. 2026-27 బడ్జెట్‌లో పట్టు పరిశ్రమకు 95.87 కోట్లు ప్రతిపాదించింది.

Updated Date - Feb 16 , 2026 | 03:32 AM