మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లపై సీపీఎం నేత శ్రీనివాసరావు స్పందించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ వార్తలు వస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో చిక్కిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సర్కార్ అనుమతినిచ్చింది.
మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత హిడ్మా మరణించగా.. ఈరోజు మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.
మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే ముందుగానే చేరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ శివారులో భారీగా చిక్కిన మావోయిస్టులను ఎస్ఐబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా మావోయిస్టుల భాష తీవ్ర అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో గోండు భాష తెలిసిన వారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
ఏపీలోని పలు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడలో 27 మంది మావోలు అరెస్ట్ అవగా.. కాకినాడ, ఏలూరులోనూ మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
డీజీపీ పర్యవేక్షణలోనే సెర్చ్ ఆపరేషన్ నడించదని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడించనున్నట్లు కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.