Share News

సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన

ABN , Publish Date - Feb 12 , 2026 | 10:12 AM

గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఈరోజు సభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.

సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 12: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఈరోజు (గురువారం) ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం, నిర్ణీత గడువుకు 10 నిముషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిన్న (బుధవారం) సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్ట సభలు, ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థులను సభకు పిలిచామన్నారు.


ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని.. కాపీలను చించి విసిరారని తెలిపారు. ఇలాంటివి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం. ఇవాళ చాలామంది పిల్లలు సభా వ్యవహారాలు చూసేందుకు వచ్చారు. చట్టసభలు, రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడి వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలి’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో అగ్నిప్రమాదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 10:54 AM