5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:05 PM
ఈ ఏడాది 5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతేడాది ఒక లక్ష మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 11: ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో ఐదు లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు స్పష్టమైన కార్యాచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేయాలని ఏపీ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ (SERP), ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని విజయవంతంగా సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.

ఇవాళ విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సెర్ప్ ద్వారా పేదల జీవనోపాధుల ప్రోత్సాహం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు.

మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల ప్రోత్సాహానికి, బుక్‌కీపింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ-నారీస్, జీవనోపాధి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరాన్ని మంత్రి హైలైట్ చేశారు.

అలాగే, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు సాంకేతిక సంస్థల సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ను బలోపేతం చేయాలని, ఎఫ్‌పీఓ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు, ఇన్‌పుట్ సెంటర్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు స్థాపనను నిర్ధారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News