Home » Andhra Pradesh » Kadapa
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సీబీఐ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
కడప జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదం కారణంగా రాయచోటి – కడప ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గువ్వల చెరువు ఘాట్‌లోని ఐదో మలుపు వద్ద ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.
కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖాజీపేటలోని ఓ లాడ్జిలో బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
తనను కొనడం వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల కాదు కదా.. ఆయన సోదరుడు వైఎస్ జగన్ వల్ల కూడా కాదని పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి ఫైర్ అయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైందని పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యానించారు.1968లో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి భార్య పులివెందుల సర్పంచ్‌గా పోటీచేశారని ప్రస్తావించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందజేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ , ఆయన సాక్షి మీడియా చేస్తున్న కుట్రలన్నీ విఫలమవుతోండటంతో ఇప్పుడు నిరుద్యోగులలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుత నటుడని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సినిమాల్లో నటిస్తే జగన్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు.