Share News

Pulivendula Politics: సొంత ఇలాకాలో జగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:25 PM

మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.

Pulivendula Politics: సొంత ఇలాకాలో జగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ
Pulivendula Politics

కడప, డిసెంబర్ 8: ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (Former CM YS Jagan Mohan Reddy) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. కేవలం 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసిన జగన్‌కు.. పార్టీ నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ముఖ్య నేతల నుంచి కిందస్థాయి శ్రేణులు అందరూ కూడా పార్టీని వీడుతున్నారు. ఓటమి మొదలు జగన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సొంత ఇలాకాలో జగన్‌కు ఆ పార్టీ నేతలు భారీ షాక్ ఇచ్చారు. పులివెందులలో వైసీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.


వేంపల్లి పట్టణంలో పలువురు నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈరోజు (సోమవారం) పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సమక్షంలో కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందిరికీ బీటెక్‌ రవి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన చూసి పులివెందుల వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నారని బీటెక్ రవి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే

కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 12:31 PM