Home » Andhra Pradesh » Guntur
గుంటూరు జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరిన IX2875 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం తిరిగి బే కు ఈ విమానం చేరుకుంది. I
ఆయుర్వేద వైద్య సేవల బలోపేతంతోపాటు క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం మేరకు రాజధాని నిర్మాణం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు.
పింఛనుదారులకు అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్ నంబర్- 126ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
పోలీసుల విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని ఆంధ్రప్రదేశ్ హో మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ఆంధ్రప్రదేశ్ సర్కార్ పొడిగించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది.
వైసీపీకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రాజీనామా చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుబ్బారావుకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.