Janasena Party: జనసేన పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు..!
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:55 PM
జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు.
అమరావతి, నవంబర్ 09: జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం సాయంత్రం ఈ ఎక్స్ ఖాతా హ్యాక్ చేసినట్లు పార్టీ కార్యాలయంలోని సిబ్బంది గుర్తించారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వ్యవహారంలో.. నాయకులను పార్టీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఈ అకౌంట్‌లో అనుమానాస్పద పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.
ఈ ఖాతా హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌తోపాటు కవర్ ఫొటోను సైబర్ నేరగాళ్లు తొలగించారు. అలాగే పార్టీకి సంబంధం లేని ఫొటోలు సైతం ఈ ఖాతాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే గతంలో ఈ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుల మాత్రం యాథావిథిగా ఉన్నాయి. కానీ దీనిపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయ లేదు.
మరోవైపు జనసేన పార్టీ ఎక్స్ ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాకింగ్‌కు గురైంది. ఆ తర్వాత జనసేన యూట్యూబ్ ఛానెల్‌ను యథాస్థితికి తీసుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
ఆస్తులు, అంతస్తులు, కార్లు ఉన్నా ఆరోగ్యమే కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు
For More AP News And Telugu News