Share News

Centre Teams Visit: మెుంథా ఎఫెక్ట్.. కేంద్ర బృందం పర్యటన వివరాలివే..

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:31 PM

మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. టీమ్-2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.పోన్నుసామి, కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ, హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు.

Centre Teams Visit: మెుంథా ఎఫెక్ట్.. కేంద్ర బృందం పర్యటన వివరాలివే..
Centre Teams Visit

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెుంథా తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం నివారించగలిగారు. మూడ్రోజులపాటు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నష్ట నివారణకు రాత్రింబవళ్లు కృషి చేశారు. అయితే, తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం నుంచి కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించనుంది. రెండు టీములుగా విడిపోయి మెుంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.


టీమ్-1 సభ్యులు, పర్యటన..

టీమ్-1లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ పుసిమి బసు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎఫ్‌సీడీ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, రోడ్లు రవాణా, హైవేలు విజయవాడ నుంచి ఈఈ శశాంక్ కుమార్ రాయ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్త సాయి భగీరథ్ ఉన్నారు. వీరంతా సోమవారం ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం అవుతారు. మొంథా తుఫానుపై ఏర్పాటు చేసిన పీపీటీ ప్రజెంటేషన్ ను తిలకిస్తారు. అనంతరం 11.15 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.30 సమయానికి ఆ జిల్లా అధికారులతో సమావేశమై పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. మధ్యాహ్నం 3.15కు కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి బృంద సభ్యులు చేరుకుంటారు. 3.30 నుంచి 4 గంటల వరకూ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు, కల్వర్టును పరిశీలిస్తారు.


అలాగే చేపల చెరువులకు జరిగిన నష్టాన్ని సైతం స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు ఎన్జీ పాడుకు చేరుకుంటారు. ఎన్జీపాడు, ఒమ్మెవరం గ్రామాలను సందర్శించి పంటనష్టాన్ని అంచనా వేడయంతోపాటు రైతులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు చీరాల చేరుకుని అక్కడి గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 9.30కు తిరిగి పర్యటన ప్రారంభించి రామవరం చేరకుంటారు. రామవరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఓడరేవు చేరుకోనున్నారు. అక్కడా పంటనష్టాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11 గంటలకు బాపట్ల కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశం కావడంతోపాటు పంటనష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి అమరావతి సచివాలయానికి కేంద్ర బృందం చేరుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తమ పరిశీలనలకు సంబంధించిన సమాచారాన్ని వివరించనున్నారు.


టీమ్-2 సభ్యులు, పర్యటన..

మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి మరో కేంద్ర బృందం సైతం ఏపీలో పర్యటించనుంది. టీమ్-2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.పోన్నుసామి, కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ, హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. వీరు సోమవారం ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. బ్లాక్ వన్‌లో సెక్రటరీలు, హెచ్‌వోడీలతో మాట్లాడడంతోపాటు మొంథా తుఫానుపై పీపీటీలను తిలకించనున్నారు. 12 గంటలకు కృష్ణా జిల్లాకు చేరుకుని 12.30కు కంకిపాడు మండలం పునాధిపాడులో వరిచేలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేస్తారు.


మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం చేరుకుని పంట నష్టంపై ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. మధ్యాహ్నం 2.30కు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేరుకుని క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలిస్తారు. అనంతరం 5.30కు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం నుంచి చిట్యాల వరకూ నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలమూరు మండలం పెనికేరు వెళ్లి అక్కడా పొలాలను పరిశీంచనున్నారు. 10.15కు కొత్తపేట మండలం మద్దులమీరకలో నష్టపోయిన అరటిపంటను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30కు తిరిగి ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రితోపాటు అధికారులకి తమ పరిశీలనల సారాంశాన్ని వివరించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివ‌నాథ్

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ఈసారి ఏయే అంశాలు చర్చిస్తారంటే..

Updated Date - Nov 09 , 2025 | 05:47 PM