ఇంటి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా.. ఇంటి వద్దకు వచ్చే గ్రామ పం చాయతీ సిబ్బందికి అందజేసి.. మీకు కావాల్సిన ఇంటి సరుకులను ఉచితంగా తీసుకోవచ్చని ఎంపీడీఓ వీరరాజు, డిప్యూటి ఎంపీడీఓ శశికళ తెలిపారు.
మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
భగవాన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం పుట్టపర్తి విమానశ్రయానికి చేరుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీ్సకు బీజేపీ నాయకులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.
విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఎస్ఎ్ఫఐ అని టూటౌన సీఐ రెడ్డప్ప, సంఘం జిల్లాకార్యదర్శి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక టూ టౌన పోలీ్సస్టేషనలో ఎస్ఎ్పఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సీఐ చేతులమీదుగా ఆవిష్కరించారు.
వేపరాళ్ల పంచాయతీ సచివాలయంలో శుక్రవారం విధులకు డుమ్మా కొట్టారు. సిబ్బంది రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక్కడ 9 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ సచివాలయంలో లేకపోవడం, వివిధ సమస్యలపైన వచ్చిన ప్రజలు వెనుతిరిగినట్లు తెలిసింది.
జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ హామీ ఇచ్చారు. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహంలో జిల్లాలో రహదారుల ప్రగతిపై రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల ఏర్పాటుపై ఆరాతీశారు. ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, ...
నిస్వార్థ సేవలకు సత్యసాయి సేవాదళ్ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన గడ్కరీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ప్రతినిధులు కొనియాడారు. సత్యసాయి బోధనలే వారిని సేవామార్గంలో నడిపిస్తున్నాయని అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు మందిరంలో గురువారం శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు రత్నాకర్, చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన ..
మండలంలోని బొల్లనగుడ్డం గ్రామ శివారులో త్రీఫేస్ విద్యుత వైర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి
మండలంలోని చీకలగురికి గ్రామం అపరిశుభ్రంగా మారింది. ఏడాదిగా డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగు నిల్వ ఉంటోంది.
మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్ ఏడీ వెంకట స్వామినాయక్ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు