పదిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం : కలెక్టర్
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:14 AM
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులకు సూచించారు.
గుత్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం సాయంత్రం కలెక్టర్ తనిఖీ చేశారు. వంద రోజుల యాక్షన ప్లానలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడి అవర్స్‌ను ఆయన పరిశీలించారు. సిలబస్‌పై విద్యార్థులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై పాఠశాల హెచఎం సుంకన్న వద్ద ఆరా తీశారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ ఉన్నారు.