Share News

సాధారణం కన్నా పెరగనున్న ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:10 PM

రాష్ట్రంలోని అంతర్‌ జిల్లాల్లో గురువారం నుంచి నాలుగు రోజులు ఎండ తీవ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది.

సాధారణం కన్నా పెరగనున్న ఉష్ణోగ్రతలు
Chennai weather

చెన్నై: రాష్ట్రంలోని అంతర్‌ జిల్లాల్లో గురువారం నుంచి నాలుగు రోజులు ఎండ తీవ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి... ఉత్తర తమిళనాడు, దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఈ కారణంగా, గురు, శుక్రవారాల్లో పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాలు, డెల్టా జిల్లాలు, దక్షిణ తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాలు, కారైక్కాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.


nani1.2.jpgమిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, అత్యధిక ఉష్ణోగ్రత 37-38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27-28 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరోగమనంలో పసిడి ధరలు

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2026 | 12:10 PM