సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:51 AM
హత్యలు చేయటం, సాక్షుల్ని బెదిరించటం, రేటు మాట్లాడటం, కుటుంబసభ్యులను, జడ్జిలను బెదిరించాలని చూడటం మాజీ సీఎం జగన్‌కు అలవాటని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
అమరావతి, ఏప్రిల్ 23: సమాజం కోసం మంచి చేసే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం అయితే హంతకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అంటూ మంత్రి సవిత(Minister Savitha) వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. హత్యలు చేయటం, సాక్షుల్ని బెదిరించటం, రేటు మాట్లాడటం, కుటుంబసభ్యులను, జడ్జిలను కూడా బెదిరించాలని చూడటం జగన్‌కు అలవాటు అంటూ మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తండ్రి శవం పెట్టుకుని రాజకీయం చేయటం, బాబాయ్ గొడ్డలి పోటు ఘటనలను ఇప్పటికే చూశామని మంత్రి తెలిపారు.
చంపటం, రౌడీలను, గూండాలను తయారు చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు మంత్రి. అనంత బాబును జగన్ నెత్తిన పెట్టుకోవటంతోనే దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకో తనానికి పరాకాష్టగా అనంత బాబు వ్యవహారం ఉందన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం వదలదని స్పష్టం చేశారు. గతంలో ఏమరపాటు ఉండి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. జగన్ వల్ల బలయ్యేవారిలో బీసీలు, దళితులే ఎక్కువ మంది ఉన్నారని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీ సిబ్బందికి గుడ్ న్యూస్.. రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి
Read Latest AP News And Telugu News