తెలంగాణకు అలర్ట్.. నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:44 AM
ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. నేడు, రేపు (ఆది, సోమవారాలు) ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే నివసించాలని వాతావరణ శాఖ సూచించింది.
కాగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వరంగల్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
పల్లెకు పోదాం.. పండగ చేద్దాం..
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్