Share News

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

ABN , Publish Date - May 01 , 2026 | 11:51 AM

తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు
Temperature, Chennai

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. వేలూరులో గరిష్టంగా 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, కరూర్‌ పరమత్తిలో 41.5 డిగ్రీలు, ఈరోడ్‌ 41.4 డిగ్రీలు, తిరుచ్చి 40.9 డిగ్రీలు, తిరుత్తణి 40.6 డిగ్రీలు, మదురై విమానాశ్రయం 40.5 డిగ్రీలు, చెన్నై మీనంబాక్కంలో 40.1 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది.


nani1.2.jpgఅలాగే, నామక్కల్‌లో 39.5 డిగ్రీలు, మదురై నగరంలో 39.4 డిగ్రీలు, తిరుపత్తూర్‌లో 39.4 డిగ్రీలు, ధర్మపురిలో 39.2 డిగ్రీలు, తంజావూరులో 39 డిగ్రీలు, చెన్నై నుంగంబాక్కంలో 38 డిగ్రీలు, కోయంబత్తూర్‌లో 37.9 డిగ్రీలు, పాళయంకోటలో 37.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత్రలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాజధాని నగరం చెన్నైలో శుక్రవారం 41 డిగ్రీల సెల్సియస్‌ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 11:52 AM