Share News

బయటకు రావాలంటేనే.. భయం

ABN , Publish Date - May 01 , 2026 | 11:26 AM

ములుగు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిం చిన వారిని ఉన్నట్టుండి దాడి చేస్తూ గాయరుస్తున్నాయి.

బయటకు రావాలంటేనే.. భయం
Street Dogs, Mulugu

  • ఊరూరా కుక్కల స్వైర విహారం

  • దాడులు చేస్తూ గాయపరుస్తున్న వైనం

  • రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

  • అయినా పట్టించుకోని యంత్రాంగం

ములుగు: ములుగు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిం చిన వారిని ఉన్నట్టుండి దాడి చేస్తూ గాయరుస్తున్నాయి. కొన్నిరోజులగా జిల్లాలోని ఆయా మండలాల్లో ఇలాంటి ఘటనలు భయాందోళన కలిగిస్తు న్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపో తున్నారు. ముఖ్యంగా పసిపిల్లలను, వృద్ధులపై శునకాలు దాడులు చేసు ్తన్నాయి. ఇంత జరుగుతుత్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవ హరిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


జిల్లా కేంద్రం ములుగుతో పాటు గోవిందరావుపేట, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, వెంకటాపూర్‌, మంగపేట, తాడ్వాయి, ములుగు మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు జిల్లాలోని జీజీహెచ్‌, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 632 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ రికార్డులు చెబుతు న్నాయి. అదే విధంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పలు పీహెచ్‌సీలో 17 కేసులు నమోదైనట్టు ధికారులు చెబుతున్నారు. ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మరిన్ని ఉన్నాయి. కుక్కల బారిన పడిన వారిలో ప్రధానంగా 10 ఏళ్లలోపు పిల్లలు అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు నడు స్తున్నాయి. అయితే వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులు చేస్తుండటంతో పిల్లల్ని ఆడుకునేందుకు బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు.


hnk2.jpgపట్టించుకోని అధికారులు

జిల్లాలో కుక్కల నియంత్రణ కాగితాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ, మునిసిపాలిటీ అధికారులు కుక్కల బెడదను పట్టించుకోవడం మానేశారనే విమర్శలు వ్యక్తమవు తున్నా యి. కుక్కల దాడుల నుంచి కాపాడాలని ఫిర్యా దు చేసినప్పటికీ పట్టించుకున్న నాఽథుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియం త్రణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవేవీ అమలు కావడం లేదని అంటున్నారు.


ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 మార్చి వరకు నమోదై కేసులు

మండలం - కుక్కకాటు కేసులు

ఏటూరునాగారం 26

గోవిందరావుపేట 52

మంగపేట 76

ములుగు 31

కన్నాయిగూడెం 38

తాడ్వాయి 70

వెంకటాపూర్‌ 41

వెంకటాపురం 42

వాజేడు 103

జిల్లా ఆస్పత్రిలో 89

ఏటూరునాగారం ఆస్పత్రి 54

సీహెచ్‌సీ వెంకటాపురం 36


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

మెట్రో రెండో దశకు లైన్‌క్లియర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 11:29 AM