Share News

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

ABN , Publish Date - Mar 30 , 2026 | 08:36 PM

విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగుల సమయంలో బయట తిరగొద్దని హెచ్చరించారు.

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
AP Weather Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు, వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగుల సమయంలో బయట తిరగొద్దని హెచ్చరించారు. చెట్ల కింద, పంట పొలాల్లో ఎవరూ ఉండకూడదని సూచించారు. మంగళవారం నాడు 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందనీ తెలిపారు. మరో 13 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు. పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయనగరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఉందనుందని వెల్లడించారు.


బుధవారం 14 మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రజలు వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42.5°C వరకూ నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఎండలు ఉండనున్నట్లు వెల్లడించారు. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..

పీ4 తనకు ఇచ్చిన తృప్తి మరే ఇతర కార్యక్రమం ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

Updated Date - Mar 30 , 2026 | 08:55 PM