మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సగం ఫ్రిజ్‌లో మిగతా భాగం మూట కట్టి ఇంట్లోనే ఓ మూలన పెట్టాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు, క్లూస్ , ఫోరెన్సిక్ టీమ్‌లు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే, ఈ కేసులో తాజాగా మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మౌనిక కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల అదుపులో ఉన్నా అతనిపై దాడికి పాల్పడ్డారు. స్థానిక అపార్ట్మెంట్ వాసులు సైతం రవీంద్రపై దాడి చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించినా బాధితులు ఆవేదనతో రెచ్చిపోయారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రవీంద్రను కఠినంగా శిక్షించాలని, మౌనికకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పోలీసులను మౌనిక తరఫు బంధువులు వేడుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
2,50,893 ఇళ్లను పేదలకు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
టిడ్కో ఇళ్లు.. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక: విజయవాడ ఎమ్మెల్యేలు