Share News

అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా?.. వైసీపీకి హోంమంత్రి సూటి ప్రశ్న

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:42 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా?.. వైసీపీకి హోంమంత్రి సూటి ప్రశ్న
Home Minister Anitha

విజయనగరం, మార్చి 30: ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్ఠంగా పని చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పష్టం చేశారు. ఈవ్ టీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. సోమవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మూలపేట పోర్టు 70 శాతం పూర్తి చేసింది కూటమి ప్రభుత్వమే అని అన్నారు. ప్రతీ విషయంలో ‘క్రెడిట్’ చోరీ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘మాది పని చేస్తున్న ప్రభుత్వం.. వాటాలు అడగని ప్రభుత్వం’ అని తేల్చిచెప్పారు.


గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టే చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాజధాని అమరావతిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారని.. ఇంతకీ వారు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నారా? లేదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని నిలదీశారు. ‘ప్రాజెక్టుల కోసం ఏ రైతు కూడా కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ’ అని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్

టిడ్కో ఇళ్లు.. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక: విజయవాడ ఎమ్మెల్యేలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 05:24 PM