ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:03 PM
ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకబడడానికి కారణమవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.
న్యూఢిల్లీ, మార్చి 30: రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావనకు తీసుకువస్తే కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, అన్ని విపక్షాలు ఏకమై తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకపడటానికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో సహా అందరూ అడ్డుకున్నారని తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని కులంగా గుర్తించి ఓబీసీ జాబితాలో చేర్చిందని... 4 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లు ఎంపీ చెప్పారు. బెంగాల్, తమిళనాడు, కేరళ, తెలంగాణలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. పోటీపడి ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థానాల్లో ముస్లింలే పోటీ చేశారన్నారు. హేట్ స్పీచ్ బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే, మొదట తెలంగాణ ప్రభుత్వం.. అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ
Read Latest Telangana News And Telugu News