Share News

సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:49 PM

గోల్డ్‌ మ్యాన్ సూర్యాభాయ్ బండారాన్ని బయటపెట్టారు ఐటీ అధికారులు. అతడి ఒంటిపై ఉన్న బంగారం అంతా నకిలీదే అని తేల్చారు.

సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ
Surya Bhai Fake Gold

హైదరాబాద్, మార్చి 30: ఒంటి నిండా బంగారంతో నిత్యం ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సూర్యాభాయ్ బండారాన్ని ఐటీ అధికారులు బయటపెట్టారు. అతడి ఒంటి మీద ఉంది అసలు బంగారం కాదని నకిలీది అని ఐటీ అధికారులు తేల్చారు. గోల్డ్‌ మ్యాన్ కొండా విజయ్ వ్యవహారం తర్వాత ఇలాంటి గోల్డ్‌ మెన్‌లపై ఐటీ అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా మరో ‘గోల్డ్‌ మ్యాన్’ సూర్యాభాయ్‌కు ఐటీ నోటీసులు జారీ చేసింది. దీంతో సూర్య.. ఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.


ఇక్కడే పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సూర్యాభాయ్ ఒంటిమీద ఉన్న బంగారం అంతా నకిలీ అని ఐటీ అధికారులు తేల్చారు. బిల్డప్ కోసం ఒంటి నిండా గోల్డ్ ధరించి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు సూర్యాభాయ్. తాను ఎప్పుడూ ఒంటి నిండా కోటి రూపాయల విలువ చేసే ఆభరణాలు ధరిస్తానని యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు సూర్య. అయితే ఐటీ విచారణలో అవి సిల్వర్, కాపర్‌లకు గోల్డ్ కోటింగ్ చేసిన నకిలీ బంగారం అని అధికారులు గుర్తించారు.


అతని హై ఎండ్ కార్ల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆ కార్లు ల్యాండ్ సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చినవని విచారణలో తేలింది. అంతేకాకుండా సూర్యాభాయ్ నెలకు రూ.20 వేలు చెల్లించి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్టు ఐటీ గుర్తించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సూర్యాభాయ్ ఆస్తులు, ఆదాయ వనరులపై ఐటీ మరింత లోతైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 04:55 PM