Share News

అన్నదాతలకు గుడ్ న్యూస్.. గడ్డి మందుని నిషేధిస్తూ తీర్మానం..

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:52 PM

తెలంగాణలో గడ్డి మందుని నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు.

అన్నదాతలకు గుడ్ న్యూస్.. గడ్డి మందుని నిషేధిస్తూ తీర్మానం..
Minister Tummala Nageswara Rao

హైదరాబాద్: తెలంగాణలో పారాక్వాట్ డైక్లోరైడ్(గడ్డి మందు)ని నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయానికి వాడుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రమాదకరంగా మారిందని.. అందుకే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సభ్యులకు మంత్రి వివరించారు. ఇది ప్రాణాంతక రసాయనమని.. దీన్ని అనేక దేశాల్లో నిషేధించారని తెలిపారు.


పారాక్వాట్ డైక్లోరైడ్ వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వాడి అనేక మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. సుస్థిర సేంద్రీయ వ్యవసాయ లక్ష్యాలకు ఇది అడ్డుగా మారిందని.. దీని తయారీ, వాడకం, రవాణా, దిగుమతి ఇలా అన్ని విధాలుగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్డి మందుని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ అసెంబ్లీలో తీర్మానం..

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

Updated Date - Mar 30 , 2026 | 06:55 PM