Share News

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ అసెంబ్లీలో తీర్మానం..

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:06 PM

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ అసెంబ్లీలో తీర్మానం..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రభావం ఆసియా దేశాలపై తీవ్రంగా పడుతోందని.. ఆర్థిక విధ్వంసం జరుగుతోందని తెలిపారు.


యుద్ధ ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉందని భట్టి పేర్కొన్నారు. ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగకపోతే ప్రపంచ దేశాల భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. ఇది ఇప్పుడు ఆగకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఖండిస్తున్నామని.. ఆయా దేశాల మధ్య శాంతి పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. యుద్ధాన్ని ఆపే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలని తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు భట్టి విక్రమార్క.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

దారుణం.. మద్యంమత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన హాస్టల్ ఉద్యోగి..

Updated Date - Mar 30 , 2026 | 06:49 PM