Share News

దారుణం.. మద్యంమత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన హాస్టల్ ఉద్యోగి..

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:54 PM

జగిత్యాల ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ ఉద్యోగి కామాటి శ్రీనివాస్ ప్రతి రోజూ మద్యంమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాగిన మత్తులో బాలురను తిడుతూ ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు.

దారుణం.. మద్యంమత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన హాస్టల్ ఉద్యోగి..
Jagityala ST Tribal Welfare Hostel

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ ఉద్యోగి కామాటి శ్రీనివాస్ ప్రతి రోజూ మద్యంమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాగిన మత్తులో బాలురను తిడుతూ ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. చీపురు తీసుకుని మరీ విద్యార్థులపై దాడి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక వీడియో తీసిన చిన్నారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సహకారంతో పేద విద్యార్థులు చదువుకుందామని హాస్టళ్లలో చేరుతుంటే.. ఇలా వేధింపులకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఘటనపై వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాళ్ల ధర్మారం నుంచి జగిత్యాలకు డిప్యుటేషన్‌పై కామాటి శ్రీనివాస్ వచ్చారు.


నల్లగొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకులంలోనూ ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. పాఠశాలలో 8, 9 విద్యార్థినిలను మోకాళ్లపై కూర్చొపెట్టి వేధించారు ప్రిన్సిపాల్. భోజనం సరిపోక అందరికీ పెట్టిన తర్వాత మిగిలిన అన్నం తిన్నందుకు విద్యార్థినులందరినీ దాదాపు రెండు గంటలపాటు మోకాళ్లపైనే కూర్చోపెట్టారు. ఎవరు తిన్నారో నిజం చెప్పకపోతే అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు ప్రిన్సిపాల్. విషయం బయటికి చెబితే టీసీ ఇస్తానని బెదిరింపులకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వరుస ఘటనలతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ

ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

Updated Date - Mar 30 , 2026 | 05:57 PM