Share News

హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:15 PM

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..
Attapur Incident in Hyderabad

హైదరాబాద్, మార్చి 30: హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. కనీసం తనపై జరుగుతున్న దాడిని కూడా అర్థం చేసుకోలేని, తన గోడును ఎవరికీ చెప్పుకోలేని ఒక మతిస్థిమితం లేని యువతిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్‌లోని మతిస్థిమితం సరిగ్గా లేని ఒక యువతిపై ఈ అఘాయిత్యం జరిగింది. యువతి ఒంటరిగా ఉన్నది గమనించిన ఒక యువకుడు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న కుటుంబ‌ సభ్యులు యువతి పరిస్థితి గమనించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిదింతుడు అదే ప్రాంతానికి చెందిన అఖిల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం యువతిని ఆస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి..

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 01:47 PM