Share News

కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:48 PM

ఢిల్లీ వెళ్లినప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఐటీ అధికారులు సందేహంతో తనను విచారించారని తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విచారణలో గోల్డ్ ఒరిజనలా? కాదా? అని తనిఖీ చేశారని చెప్పారు.

కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్
Konda Vijay Kumar

హైదరాబాద్, మార్చి 30: ఢిల్లీ వెళ్లినప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఐటీ అధికారులు సందేహంతో తనను విచారించారని తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విచారణలో గోల్డ్ ఒరిజనలా? కాదా? అని తనిఖీ చేశారని చెప్పారు. అలాగే హవాలా లింకులు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారని తెలిపారు. తాను ధరించిన బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ అడిగారని.. అప్పటికప్పుడు ఇంటి నుంచి పంపిన డాక్యుమెంట్స్‌ను ఐటీ అధికారులకు చూపించానని పేర్కొన్నారు. అయితే కేజీ బంగారానికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో.. దానిని సీజ్ చేశారని వివరించారు.


తనను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన ఒంటిపై 3 కేజీల బంగారం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అధికారులు తన వద్ద నుంచి పాన్ కార్డుతోపాటు ఇతర వివరాలను తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో.. ఐటీ అధికారులు అనుమానంతో తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ విచారణలో ఐటీ అధికారులకు తాను పూర్తిగా సహకరించానన్నారు. గోల్డ్‌కు సంబంధించిన ఆధారాలు చూపించడంతో ఐటీ అధికారులు సైతం సంతృప్తి చెందారని తెలిపారు.


తనకు నోటీసులు అందిన తర్వాత.. సీజ్ చేసిన కేజీ బంగారానికి సంబంధించిన బిల్స్ అప్పగిస్తానని పేర్కొన్నారు. తనకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలంగాణ గోల్డ్ మ్యాన్ విజయకుమార్ వెల్లడించారు. నేషనల్ బ్యాంక్‌లకు సైతం తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పారు. దాంతో ఆదాయం కూడా తనకు అధికంగానే వస్తుందన్నారు. ఏదో ఒక రోజు ఐటీ సోదాలు జరుగుతాయని తాను భావించానని.. ఈ నేపథ్యంలో తాను ముందు నుంచి అందుకు సిద్ధంగానే ఉన్నానని గోల్డ్ మ్యాన్ విజయ్‌కుమార్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్

For More TG News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 03:11 PM