సుర్రుమంటున్న సూరీడు
ABN , Publish Date - Apr 16 , 2026 | 09:45 AM
భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బేగంబజార్‌లో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు
రాత్రిళ్లు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి
సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికం
హైదరాబాద్ సిటీ: భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి వీస్తున్న వేడిగాలులతో బయట అడుగుపెట్టేందుకు వణికిపోతున్నారు. బుధవారం బేగంబజార్‌లో 41.2, శేరిలింగంపల్లి, మలక్‌పేట, హయత్‌నగర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో కూడా 26 నుంచి 28 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉక్కపోతతో ప్రజలు ఉడికిపోతున్నారు. సాధారణం కంటే పగటి పూట 3 డిగ్రీలు, రాత్రి పూట 4 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరడంతో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. నెలాఖరుకు పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీలకు చేరే అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ప్రాంతం - ఉష్ణోగ్రతలు
బేగంబజార్ 41.2
శేరిలింగంపల్లి 41.0
మలక్‌పేట 41.0
హయత్‌నగర్ 41.0
అంబర్‌పేట 41.0
సికింద్రాబాద్ 40.9
బేగంపేట 40.9
చందానగర్ 40.9
వడగాలుల హెచ్చరికలు
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ డెవల్‌పమెంట్ ప్లానింగ్ సొసైటీ గ్రేటర్‌లోని పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. గండిపేటలో అత్యధికంగా 42.3, మేడిపల్లిలో 42.2, దుండిగల్‌లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలను అప్రమత్తం చేసింది. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తాజ్‌మహల్ తరహాలో చార్మినార్ అభివృద్ధి
శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు
Read Latest Telangana News and National News