Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:10 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు
andhra pradesh cyclone alert

విశాఖపట్నం, నవంబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నవంబర్ 15వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం మరుసటి రోజుకు అనగా నవంబర్ 16 వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో కోస్తా తీరం వెంబడి అత్యంత వేగంగా గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 09:34 PM