విశాఖ జూలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జన్మించిన 4 సింహం పిల్లలు
ABN, Publish Date - Sep 23 , 2026 | 11:34 AM
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో నాలుగు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. అంతరించిపోతున్న ఆసియా సింహాల (పంథేరా లియో పెర్సకా) జాతి పరిరక్షణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో నాలుగు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. అంతరించిపోతున్న ఆసియా సింహాల (పంథేరా లియో పెర్సకా) జాతి పరిరక్షణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు నెల రోజుల క్రితం జన్మించిన నాలుగు సింహం పిల్లలు తల్లి సంరక్షణలో క్షేమంగా ఉన్నాయి. సింహం పిల్లల ఆరోగ్యంపై నిశితంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జూలో నాలుగు సింహం పిల్లల జననం, వన్యప్రాణుల సంరక్షణపై జూ నిబద్ధతకు ఇది నిదర్శనమని జూ పార్క్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 23 , 2026 | 11:53 AM