జనసేనలోకి వంగవీటి రాధా
ABN, Publish Date - Oct 14 , 2026 | 07:48 AM
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో ఈరోజు (బుధవారం) చేరనున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో రాధాకృష్ణ చేరనున్నట్లు సమాచారం.
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో ఈరోజు (బుధవారం) చేరనున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో రాధాకృష్ణ చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ కల్యాణ్, చంద్రబాబును వంగవీటి రాధా కలిసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ, ఆయన సతీమణి పుష్పవల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ మేయర్ సీటు వంగవీటి కుటుంబానికే అంటూ రాజకీయంగా చర్చించుకుంటున్నారు.
Updated at - Oct 14 , 2026 | 08:15 AM