ముదిరిన కార్తీక దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి లీగల్ నోటీసులు

ABN, Publish Date - Nov 25 , 2026 | 02:10 PM

మధురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం తీవ్రరూపం దాల్చింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపతూన్ వద్ద దీపం వెలిగించకపోవడంపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత జి. భాను ప్రకాష్ రెడ్డి న్యాయవాది ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపారు.

మధురై తిరుప్పరంకుండ్రం కార్తీకదీపం వివాదం వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, మధురై కలెక్టర్, ఆలయ ఈవోలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద దీపం వెలిగించినప్పటికీ.. కోర్టు ఆదేశాల ప్రకారం దీపతూన్ వద్ద వెలిగించకపోవడం ఆదేశాలను అమలు చేసినట్లు కాదని నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నోటీసులు అందిన 48 గంటల్లోగా ఈ సంఘటనపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Updated at - Nov 25 , 2026 | 02:12 PM