ధరణి, భూ భారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ABN, Publish Date - Jul 02 , 2026 | 07:59 AM

ధరణి, భూ భారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ధరణి, భూ భారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ధరణి భద్రతా లోపాలను అక్రమ శక్తులు దుర్వినియోగం చేశాయని అధికారులు గుర్తించారు. భూ భారతి పోర్టల్‌కూ అదే తరహా ముప్పు ఉన్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది.


భవిష్యత్తులో అక్రమాలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కొత్త భద్రతా ప్రమాణాలతో పోర్టల్ అభివృద్ధికి ఎన్‌ఐసీకి ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ప్రభుత్వానికి ప్రత్యేక కమిటీ నివేదిక అందజేయాలని ఆదేశించింది. భూముల రికార్డుల భద్రతపై రాజీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated at - Jul 02 , 2026 | 08:11 AM