కురుపాం గురుకులం వైరల్ జ్వరాలపై అలర్ట్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ABN, Publish Date - Nov 07 , 2026 | 10:16 AM
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్ జ్వరాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల పాఠశాలలో 516 మంది విద్యార్థినులు ఉన్నారు. రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థులు జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. తుపాను ప్రభావంతో ముందుగా ఇద్దరు విద్యార్థినులకు జ్వరం రాగా.. అది నెమ్మదిగా మిగిలిన విద్యార్థులకు సోకినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల తీరును ఏబీఎన్ వరుస కథనాలతో బట్టబయలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి.. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురుకులం వద్ద వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయి.
Updated at - Nov 07 , 2026 | 10:18 AM