ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు
ABN, Publish Date - Nov 09 , 2026 | 07:09 PM
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే జనవరిలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సంసిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఈసీ ముమ్మరంగా అడుగులు ముందుకేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు
మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
Updated at - Nov 09 , 2026 | 07:09 PM