ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఎల్లుండి ఫలితాలు

ABN, Publish Date - Nov 01 , 2026 | 08:03 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాగా.. ఎల్లుండి (మంగళవారం) ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. రసవత్తరంగా కొనసాగుతున్న ఈ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఏపీ వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్, 70 మున్సిపాలిటీ, 6 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 99. 36 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను మోహరించామని అధికారులు వెల్లడించారు.

Updated at - Nov 01 , 2026 | 08:03 AM