రజతోత్సవ వేళ కొత్త కార్యాలయంలోకి కలిసి అడుగులు వేసిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్
ABN, Publish Date - Oct 21 , 2026 | 07:22 PM
రెండున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రజల గొంతుకై.. అన్యాయాలను ప్రశ్నిస్తోన్న ఆంధ్రజ్యోతి రజతోత్సవ సందర్భంగా కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టింది.
రెండున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రజల గొంతుకై.. అన్యాయాలను ప్రశ్నిస్తోన్న ఆంధ్రజ్యోతి రజతోత్సవ సందర్భంగా కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టింది. 2002 అక్టోబర్ 14న విజయదశమి నాడు అక్షర ఆయుధాలు ధరించి.. అన్యాయాలను ఎదురిస్తున్న ఆంధ్రజ్యోతి, అధికార మదాన్ని ఉప్పుపాతర వేసే ఏ అవకాశాన్ని వీడిపోకుండా ఉండేందుకు 2009లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిగా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఈ రెండూ విభాగాలు విజయదశమి నాడే ఒకటే కార్యాలయంలోకి కలిసి అడుగులు వేశాయి. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన అక్రమ ఆస్తుల పునాదులపై కాకుండా.. పట్టుదల, క్రమశిక్షణ, నిర్భీతి, దృఢసంకల్పంతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. అధికార మదపుటేనుగుల గుండెల్లో దడ పుట్టించడానికి సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..
Updated at - Oct 21 , 2026 | 09:57 PM