ఆధార్‌తో ఆస్తులు హాంఫాట్! ఏబీఎన్ కథనంతో కదిలిన ఏపీ సర్కార్

ABN, Publish Date - Aug 04 , 2026 | 09:56 AM

ఆధార్‌తో ఆస్తులు అధికారికంగా హాంఫాట్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం సంచలనాలను సృష్టించింది. ఇదేలా సాధ్యమంటూ పాఠకులు ఆశ్చర్యపోయారు.

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):: ఆధార్‌తో ఆస్తులు అధికారికంగా హాంఫాట్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం సంచలనాలను సృష్టించింది. ఇదేలా సాధ్యమంటూ పాఠకులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మోసగాళ్లు తమ ఆధార్ కార్డులో నంబర్ అలాగే ఉంచి ఇతర వివరాలను మార్చేసి పక్కాగా మార్పులు చేస్తున్నారు. బయోమెట్రిక్స్ సరిపోలడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తి బదలాయింపు ఏ అనుమానం లేకుండా జరిగిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో తన ఆస్తి గురించి ఆరా తీసిన యజమాని అప్పటికే అది చేతులు మారిన విషయం తెలిసి విస్తుబోతున్నారు.

Updated at - Aug 04 , 2026 | 10:11 AM