టమాటా శాండ్విచ్.. ఇలాచేస్తే ఆ టేస్టే వేరు..
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:24 PM
టమాటా శాండ్విచ్.. తయారీకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు - నాలుగు, పనీర్ - 150 గ్రాములు, జీడిపప్పు(నీళ్లలో నానబెట్టినవి) - 12.
కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు - నాలుగు, పనీర్ - 150 గ్రాములు, జీడిపప్పు(నీళ్లలో నానబెట్టినవి) - 12, వెల్లుల్లి రెబ్బలు-4, ఆలివ్ ఆయిల్ - స్పూను, మిరియాల పొడి - పావు స్పూను, టమాటా ముక్కలు - అర కప్పు, నూనె - స్పూను, చిల్లీ ఫ్లేక్స్ - అర స్పూను, కొత్తిమీర తరుగు - స్పూను, ఉప్పు - సరిపడినంత, బటర్ - కాస్త.
తయారుచేసే విధానం: పనీర్, జీడిపప్పు, సగం వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పును మిక్సీలో వేసి క్రీమ్‌లా తయారుచేసుకోవాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి మిగతా వెల్లుల్లి, టమాటా ముక్కల్ని వేయించాలి. ముక్కలు కాస్త మెత్తగయ్యాక చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు కొత్తిమీర జతచేసి స్టవ్ కట్టేయాలి. మొత్తం చల్లగా అయ్యాక బ్రెడ్ ముక్కలపై పనీర్ పేస్టు రాసి, పైన టమాటా మిశ్రమాన్ని ఉంచాలి. ఆ పైన మరో బ్రెడ్ ముక్కను పెట్టి బంగారు రంగు వచ్చేవరకు పెనంమ్మీద కాలిస్తే శాండ్విచ్ రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News