పూరీ దగ్గర సముద్రంలో చిక్కుకున్న మరో బోటు..
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:28 PM
ఒడిశాలోని పూరీ దగ్గర సముద్రంలో మరో బోటు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా విశాఖకు చెందిన బోటు సముద్రంలో నిలిచిపోయింది. బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఒడిశాలోని పూరీ దగ్గర సముద్రంలో మరో బోటు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా విశాఖకు చెందిన బోటు సముద్రంలో నిలిచిపోయింది. బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు. వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. తమను రక్షించాలంటూ వీడియో విడుదల చేశారు.
సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. జులై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ గల బోటులో ఏడుగురు వ్యక్తులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే, సముద్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో వారు తిరిగి హార్బర్‌కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు.
మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పారు. కానీ, సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్‌కు రాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు
సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం