Share News

రవ్వ కేక్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు...

ABN , Publish Date - May 03 , 2026 | 12:55 PM

కావలసిన పదార్థాలు: రవ్వ - రెండు కప్పులు, పెరుగు - అర కప్పు, నూనె - అర కప్పు, చక్కెర- కప్పు, పాలు - కప్పున్నర, ఉప్పు - పావు స్పూను

రవ్వ కేక్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు...
Ravva Cake

కావలసిన పదార్థాలు: రవ్వ - రెండు కప్పులు, పెరుగు - అర కప్పు, నూనె - అర కప్పు, చక్కెర- కప్పు, పాలు - కప్పున్నర, ఉప్పు - పావు స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ముప్పావు స్పూను, బేకింగ్‌ సోడా- పావు స్పూను, యాలకుల పొడి - అర స్పూను, ఎరుపు, పచ్చని ట్రూటీ ఫ్రూటీ - అర కప్పు.


book9.jpgతయారుచేసే విధానం: రవ్వను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో అర కప్పు నూనె, పెరుగు, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత కప్పు పాలు కలపాలి. రవ్వ పొడి, ఉప్పు కూడా జతచేసి, అంతా కలిపి పదినిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తరవాత ఈ మిశ్రమానికి బేకింగ్‌ పొడి, సోడా, యాలకుల పొడి, పావు కప్పు పాలు చేర్చాలి. ఇంకా కొన్ని ట్రూటీ ఫ్రూటీ కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతా సాస్‌పాన్‌ మీద వేసి, పైన మిగిలిన ట్రూటీ ఫ్రూటీలను వేసి, తక్కువ మంట మీద గంట పాటు ఉడికిస్తే కేక్‌ సిద్ధం. దీనిని ఓవెన్‌లో కూడా వేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేశదేశాల మామిడి పానీయాలు

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2026 | 01:01 PM