ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - May 03 , 2026 | 11:45 AM
ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. మార్చి 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
కోల్‌కతా, మే 3: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29వ తేదీన 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. అయితే, రెండో విడత ఎన్నికల్లో పలు బూత్‌లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఈసీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మగ్రహట్ పశ్చిమ నియోజవర్గంలోని 11 బూత్‌లు, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరిపింది. ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. మార్చి 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ఈసీ రిపోర్టులో సంచలన విషయాలు..
ఎన్నికల కమిషన్.. బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన లేఖలో పలు అక్రమాలను ప్రస్తావించింది. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగినట్లు పేర్కొంది. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకోవడానికి బ్యాలెట్ యూనిట్ల బటన్లపై నల్లటి టేపులు వేసినట్లు తెలిపింది. ఓ నిర్దిష్ట అభ్యర్థికి ఎవరు ఓటు వేశారో గుర్తించడానికి బ్యాలెట్ యూనిట్ల బటన్లపై నిందితులు సెంట్ కొట్టడంతో పాటు సిరాను పూసినట్లు లేఖలో వెల్లడించింది. 285 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ధ్రువీకరించారని తెలిపింది.
ఇవి కూడా చదవండి
విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు
స్కూలు డ్రాపవుట్...ఇప్పుడు టెక్ టాపర్...