వంటలు: మాంసకృత్తుల మెరుగులు - వరిగలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:21 PM
నగపిండికన్నా ఎక్కువ పోషకాలు కలిగి, శనగపిండి కన్నా తేలికగా అరిగి, బియ్యప్పిండి, గోధుమ పిండి, మైదాపిండి శనగపిండి, బఠాణీ పిండికి బదులుగా వాడుకోగలిగి, అన్నంగా వండుకుని తినగలిగే ధాన్యం ‘వరిగలు’.
శనగపిండికన్నా ఎక్కువ పోషకాలు కలిగి, శనగపిండి కన్నా తేలికగా అరిగి, బియ్యప్పిండి, గోధుమ పిండి, మైదాపిండి శనగపిండి, బఠాణీ పిండికి బదులుగా వాడుకోగలిగి, అన్నంగా వండుకుని తినగలిగే ధాన్యం ‘వరిగలు’. వరిగల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
12.5 శాతం ప్రొటీన్లు, 8.5శాతం ఆహారపీచు ఈ వరిగల ప్రత్యేకత. ఇనుము, భాస్వరం, ‘బి’ విటమిన్లను అందించటంలో ఇతర ధాన్యాల తోనూ, చిరుధాన్యాలతోనూ పోలిస్తే వరిగలే మెరుగైన ధాన్యంగా నిలుస్తాయి. వరిగల్లో క్యాల్షియం తక్కువగా ఉంటుంది కాబట్టి వీటితో రాగుల్ని కలిపి వంటకాలు చేసుకుంటే గొప్ప పోషకం తయారవుతుంది.
జొన్న రొట్టెలు చేసుకోలేక, జొన్న అన్నం తినలేక ఇబ్బంది పడే షుగరు రోగులకు వరిగలు మంచి ప్రత్యామ్నాయం. వరిగలు, జొన్నరవ్వ కలిపి వండితే రుచికరంగా ఉంటాయి.
వరిగలు త్వరగా ఉడికిపోయి ఇంధనం ఆదా అవుతుంది. ఒకటికి రెండున్నర రెట్లు నీళ్లు పోసి వండితే అన్నం బాగా ఉడుకుతుంది. పప్పు, పచ్చడి, పులుసుకూరలు, చారు, సాం బారు, పెరుగు - వీటికి వరిగల అన్నం బాగా సూటవుతుంది.
వరిగల పిండిలో బార్లీ, జొన్న, రాగి లేదా మనకు నచ్చిన ఇతర ధాన్యపు పిండిని కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. వరిగలు మినప్పప్పు కలిపి రుబ్బి దోశలు వేసుకుంటే రుచిగా ఉంటాయి. ఆమేరకు బియ్యం వాడకం తగ్గినట్టే కదా!
వరిగల పిండి శనగపిండిని పోలిఉంటుంది. బజ్జీలు, పకోడీలకు అనుకూలం. ఇగురుకూర లను చిక్కబరచడానికి ఈ పిండివాడుకోవచ్చు. పులుసు, సాంబారు, చల్లపులుసు వంటివి కాచేటప్పుడు కొద్దిగా వరిగల పిండి కలిపితే త్వరగా చిక్కబడతాయి. రుచితో పాటు ఆహా రంలో వరిగల పోషక విలువ కూడా వాటిల్లో చేరుతుంది. గోధుమ, బార్లీ వంటి ధాన్యాల్లోని గ్లూటెన్ కొంతమందికి సరిపడదు. వరిగలు గ్లూటెన్ లేని ధాన్యం. అందరికీ అనుకూలం.
హిందీలో చీనా, కన్నడలో బరగు, తమిళంలో పనివరగు, మహారాష్ట్రలో వరి లేదా భగర్ అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలప్పుడు సాధారణ ధాన్యాలకు బదులుగా వరిగలతో కిచిడీ, పులావ్, ఉప్మా, వడ వంటి వంటకాలను మహారాష్ట్రులు చేసుకుంటారు.
రక్తంలో షుగరుని పెంచే గుణం ఎంత ఉన్నదో చెప్పే దాన్ని గ్లైసెమిక్ సూచిక
(జిఐ) అంటారు. వరిగల జిఐ సుమారు 56గా ఉంది. ఇది తెల్లబియ్యం, గోధుమ, ఇంకా కొన్ని ఇతర ధాన్యాల కంటే తక్కువ. అందుకని షుగరుని పెంచే ధాన్యాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోదగిన వాటిలో వరిగలు కూడా ముఖ్యమైనవే!
వరిగలు తక్కువ నీటితో, తక్కువ కాలంలో పండే పంట. ఎల్‌నినో లాంటి వాతావరణ మార్పులు, నీటి కొరత, సాగునీటి మీద పెరుగుతున్న ఒత్తిడి ఉన్న కాలంలో ఇలాంటి పంటలకు ప్రాధాన్యం పెరగాలి. తక్కువ నీటితో వరిగల్లాంటి చిరుధాన్యాల వైపు రైతులు మళ్లడం ఆహార భద్రతకూ ఉపయోగకరం.
వరిగలు, రాగులు కలిపి లడ్డూలు చేసు కోవచ్చు. పాఠశాల పిల్లలకు వయసుకు తగిన విధంగా ఇలాంటి చిరుధాన్య వంటకాలను అందించగలిగితే మంచి పోషకాహారం అందు తుంది. మధ్యాహ్న భోజన పథకాల్లో వరిగలకు చోటు కల్పిస్తే, మంచి మార్కెట్ ఏర్పడుతుంది. రైతులు ఇటువైపు దృష్టినిమళ్ళించగలుగుతారు.
మాంసకృత్తులు, పీచు, త్వరగా ఉడకటం, తక్కువ నీటితో పండటం, ఎన్నో రకాల వంట కాలకు అనుకూలంగా ఉండటం లాంటి అనేక ప్రయోజనాలూ కలగలసిన ధాన్యం వరిగలు.
మన వంటింటి జ్ఞాపకాల్లోంచి మరుగున పడిన వరిగలు అనే ఈ చిట్టిగింజల్లో రైతుకు మేలు, వంటింటికి, ఒంటికి బలం, నోటికి రుచి, పొట్టకు సౌకర్యం ఇన్ని ఉన్నాయి. వరిగలుపాత కాలపు ధాన్యం మాత్రమే కాదుమారుతున్న కాలానికి సరిపోయే మన భవిష్యత్తు కూడా!
డా. జి.వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News