వంటలు: ద్రాక్ష పచ్చడి
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:07 PM
ద్రాక్ష పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: గింజలు లేని ద్రాక్ష - పావు కిలో, ఆచార్ మసాలా - రెండున్నర స్పూన్లు, కారం - ముప్పావు స్పూను, నల్ల ఉప్పు - పావు స్పూను.
కావలసిన పదార్థాలు: గింజలు లేని ద్రాక్ష - పావు కిలో, ఆచార్ మసాలా - రెండున్నర స్పూన్లు, కారం - ముప్పావు స్పూను, నల్ల ఉప్పు - పావు స్పూను, నిమ్మ రసం - ఒకటిన్నర స్పూను, చక్కెర - అర స్పూను, నూనె - నాలుగు స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ద్రాక్ష పళ్లను బాగా కడిగి, తుడిచి పెట్టుకోవాలి. ఓ వెడల్పాటి గిన్నెలో దాక్ష పళ్లు, మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, ఓ గంటపాటు మూతమూసి పెట్టాలి. ఆ తరవాత ఓ సీసాలో వేసుకుంటే సరి. మూడు రోజుల పాటు బాగానే ఉంటుంది. వారం రోజులు వరకు కావాలంటే ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News