‘సీఎం హత్యకు రెడీ’ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:35 AM
తనకు కోటి రూపాయిలు ఇస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానని.. అందుకు తన సెల్ నంబర్‌ను సంప్రదించాలంటూ ప్రకటన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గౌహతి, ఆగస్టు16: తనకు కోటి రూపాయిలు ఇస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానని.. అందుకు తన సెల్ నంబర్‌ను సంప్రదించాలంటూ ప్రకటన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి, సోదరుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని అస్సాం పోలీసులు వెల్లడించారు. మోరిగావ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సీఎం శర్మ హత్యకు సోషల్ మీడియాలో ప్రకటించిన సెల్ నంబర్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టినట్లు వారు వివరించారు. దీనిపై విచారణ చేపట్టగా.. ఆ నంబర్ అబ్దుల్ ముతాలేబ్ పేరు మీద ఉందని అన్నారు. అతడు వృత్తిరీత్యా టైలర్‌గా జీవనంగా సాగిస్తున్నారని పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని గౌహాటిలోని ఖానాపారాలో శుక్రవారం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియాలో లైవ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అస్సాం సీఎంను తాను హత్య చేస్తానని ప్రకటించాడు. అందుకు కోటి రూపాయిలు ఇస్తే ఆ పని చేస్తానని వెల్లడించారు. అందుకు తన సెల్ నంబర్ సంపద్రించాలని సోషల్ మీడియాలో ప్రకటించాడు. అదే సమయంలో పాకిస్థాన్‌ను అనుకూలంగా.. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
దాంతో భూరగావ్ పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. అబ్దుల్ ముతాలేబ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడి తండ్రి, సోదరుడితోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రకటన అబ్దుల్ ముతాలేబ్ ఒక్కరే చేశారా? లేకుంటే.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపు ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఆ కేసుకు సంబంధించి అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..
For More National news And Telugu News