Share News

వంటలు: కొబ్బరి పేడా.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:50 PM

వంటలు: కొబ్బరి పేడా తయారీకి కావాల్సిన పదార్థాలు: తాజా పచ్చి కొబ్బరి- ఒకటిన్నర కప్పు, పాలు- కప్పు, ఎండు కొబ్బరి- నాలుగు స్పూన్లు, క్రీమ్‌ - కప్పు.

 వంటలు: కొబ్బరి పేడా.. తయారు చేసుకోండిలా..
Vantalu

కావాల్సిన పదార్థాలు: తాజా పచ్చి కొబ్బరి- ఒకటిన్నర కప్పు, పాలు- కప్పు, ఎండు కొబ్బరి- నాలుగు స్పూన్లు, క్రీమ్‌ - కప్పు, నెయ్యి - స్పూను, చక్కెర - కప్పు, పాల పొడి - ఒకటిన్నర కప్పు, స్ట్రాబెర్రీ జామ్‌- పావు కప్పు.


vanta.jpgతయారుచేసే విధానం: ఓ గిన్నెలో కొబ్బరి, కప్పు పాలు పోసి కలుపుకోవాలి. దీన్ని బాణలిలోకి వేసి ఉడికించాలి. నిమిషం తరవాత క్రీమ్‌ కలపాలి. ఆ తరవాత చక్కెర వేయాలి. పూర్తిగా చక్కెర కరిగాక, అర కప్పు పాలు చేర్చి, మంట తగ్గించాలి. నెయ్యి వేసి కలపాలి. అంతా దగ్గరికి అవుతుంటే స్టవ్‌ కట్టేయాలి. మిశ్రమం చల్లారాక చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో ముద్దని ఎండు కొబ్బరిలో అద్ది పేడాగా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కో పేడాకి పైన కాస్త స్ట్రాబెర్రీ జామ్‌ వేస్తే సరి. ఇష్టమైన వాళ్లు దీనికి బదులుగా డ్రైఫ్రూట్స్‌ కూడా వేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెంతులు, మెంతికూరతో ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే?

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 12:50 PM